మోర్తాడ్ వాసికి అరుదైన గౌరవం
మోర్తాడ్(బాల్కొండ) : నిజాం పాలనలో తెలుగు సాహిత్యానికి ప్రతిబింబంగా నిలిచిన సిరిసినహాళ్ కృష్ణమాచారికి అరుదైన గౌరవం దక్కింది. మోర్తాడ్‌కు చెందిన కృష్ణమాచారి నిజాం కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి శతావధానిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా కోరుట్లలోని వేద పాఠశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహిస్తూ అక్కడే స్థిరపడినా మోర్తాడ్‌లో ఆయన మూలాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి జీవం పోసిన కృష్ణమాచారి ఎన్నో పుస్తకాలను రచించారు. ఆయన రాసిన పుస్తకాలపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పలువురు పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి కృష్ణమాచారి చేసిన సేవలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కృష్ణమాచారి పేరిట ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన కీర్తి విస్తరించింది. ప్రస్తుత ప్రభుత్వ నేతృత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ 2026 క్యాలెండర్‌పై కృష్ణమాచారి ఫొటోను ముదించారు. తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించిన కృష్ణమాచారికి గుర్తింపు తగిన గుర్తింపు దక్కిందని మోర్తాడ్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాహిత్య అకాడమీ క్యాలెండర్‌పై సాహితీవేత్త సిరిసినహాళ్
కృష్ణమాచారి చిత్రం
తొలి శతావధానిగా
గుర్తింపు పొందిన జిల్లావాసి


