జాతీయస్థాయి వుషూ పోటీల్లో పతకాలు
సుభాష్‌నగర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గతనెల 24 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన 9వ జాతీయస్థాయి వుషూ ఫె డరేషన్ కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారని కోచ్‌లు వేముల సతీశ్, మహ్మద్ సనాహుల్ల, సాయినాథ్ గురువా రం తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీని యర్ పోటీల్లో ఆయా కేటగిరిల్లో 80 మంది క్రీడాకారులు పాల్గొనగా, 34 మంది పతకాలు సాధించారని, ఒక బంగారు పతకం, 6 రజతాలు, 27 కాంస్య పతకాలు గెలుపొందారని వివరించారు. విజేతలకు వుషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహైల్ అహ్మద్ పథకాలు ప్రదానం చేసినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులు వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చాంపియన్‌షిప్ డైరెక్టర్ శంభు సేథ్, ముఖేష్‌ను అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, ప్రధానకార్యదర్శి అబ్దుల్ ఒమర్ అభినందనలు తెలిపారు. ప్రతినిధులు అబ్దుల్ ఒమర్, శ్రీ రాముల సాయికృష్ణ, రవితేజ, తైమూర్, పరిపూర్ణ చారి పాల్గొన్నారు.


