బైక్‌పై ‘ఉమ్లింగ్ లా’కు ఇందూరు యువకుడు
● ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ పాస్
● గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ
డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్): సొంత బైక్‌పై ప్రపంచంలోనే ఎత్తయిన మోటారబుల్ పాస్ ఉమ్లింగ్ లా చేరిన యువకుడిగా నగరానికి చెందిన మోటో వ్లాగర్ గత్క సుశాంత్ నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్ నుంచి 14 జూలై 2025న తన బైక్‌పై బయలుదేరిన సుశాంత్ 7,316 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి ఆగస్టు 14న తిరిగి జిల్లాకు చేరుకున్నారు. సొంత డామినార్ 400సీసీ బైక్‌పై నిజామాబాద్ నుంచి లడఖ్ వరకు మోటార్‌సైకిల్ రౌండ్ ట్రిప్ పూర్తి చేసిన మొదటి డాక్యుమెంటెడ్ మోటోవ్లాగర్‌గా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్ పాస్ ఉమ్లింగ్‌లా (19,024 అడుగులు / 5,883 మీటర్లు) చేరుకున్నాడు.
చేరుకున్నారిలా..
నిజామాబాద్ నుంచి బయల్దేరి 44 నంబర్ జాతీయ రహదారి మీదుగా ఆగ్రా, మధుర, ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి జమ్మూ, వైష్ణో దేవి, శ్రీనగర్, జోజిల్లా పాస్, పహల్గాం, సోన్ మార్గ్, కార్గిల్, లేహ్ మీదుగా ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన మోటారబుల్ పాస్ (17,982 అడుగులు) ఖార్దుంగ్ లా చేరుకున్నారు. దేశంలోని చివరి గ్రామం టాంగ్‌ను సందర్శించారు. తర్వాత డిస్కిట్ మఠం, హుందర్, పాంగాంగ్ లేక్, హన్లే ప్రాంతం మీదుగా ప్రపంచంలోనే మొదటి ఎత్తయిన మోటారబుల్ పాస్ (19,024 అడుగులు) ఉమ్లింగ్ లా చేరుకున్నారు. ఉమ్లింగ్ లా చేరుకున్న సుశాంత్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇండియా–చైనా సరిహద్దు ప్రదేశాలను వీక్షించి చండీగఢ్, ఝాన్సీ నగరాల మీదుగా తిరిగి నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఈ జర్నీ మొత్తాన్ని సుశాంత్ బైక్‌పై అమర్చిన కెమెరా ద్వారా చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. అతి ఎత్తు, తక్కువ ఆక్సిజన్, కఠిన రోడ్లు, అనిశ్చిత వాతావరణం వంటి సవాళ్లను ఎదుర్కొని ఈ మోటార్ జర్నీని విజయవంతంగా పూర్తి చేయడంపై సుశాంత్ ప్రశంసలు అందుకున్నారు.


