సిర్‌పూర్ విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతులు
మోపాల్: కెనడా దేశం నుంచి వెలువడే అంతర్జాతీయ బాలల పత్రిక గడుగ్గాయి నిర్వహించిన అంతర్జాతీయ కవితల, కథల, వ్యాసాల పోటీలో మండలంలోని సిర్‌పూర్ హైస్కూల్ విద్యార్థులు బహుమతులు సాధించినట్లు హెచ్‌ఎం సత్యనారాయణ తెలిపారు. గురువారం పాఠశాలలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సంక్రాంతి సందర్భంగా దేశ విదేశాల్లోని విద్యార్థులకు తెలుగు భాషలో సృజనాత్మక రచన పోటీలను ఈ పత్రిక నిర్వహించిందన్నారు. పోటీలకు సంబంధించిన ఫలితాలు గురువారం అందాయని, కవితల విభాగంలో యం.మేఘన, టి.అక్షయ, కథల విభాగంలో యం హరిణి, ఎం మాధురి, కే గాయత్రి, ఆర్ శ్రావణి బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. కవితల విభాగం, వ్యాసరచన పోటీల్లో పి.లతిక, ఎం. అనన్య బహుమతులు గెలుపొందారని, మొత్తం 8 బహుమతులు సిర్‌పూర్ ఉన్నత పాఠశాలకు లభించాయని తెలిపారు. పోటీలకు విద్యార్థులను సంసిద్ధులను చేసిన తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్లను హెచ్‌ఎం అభినందించారు. ఉపాధ్యాయులు ఏ శ్యామల, అక్బర్ బాషా, వందన, డాక్టర్ హజారే శ్రీనివాస్ పాల్గొన్నారు.


