పల్లె పాలన మరింత చేరువ
సుభాష్‌నగర్: పల్లె పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత రద్దయిన గ్రామ పంచాయతీ స్థాయీ సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం గతంలో మాదిరిగా ప్రతి గ్రామంలో నాలుగు సంఘాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాలో 545 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి దోహద పడాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీకి నలుగురు చొప్పున ఏర్పాటు చేసిన స్థాయీ సంఘాలు గడిచిన పదేళ్ల కాలంలో కనుమరుగయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయడం వంటి బాధ్యతలతో గతంలో ఈ సంఘాలు ఏర్పాటయ్యాయి. స్థాయి సంఘాల జోక్యాన్ని, ప్రమేయాన్ని సర్పంచులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయంగా వ్యతిరేకించడంతో అప్పట్లో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టికేంద్రీకరించకపోవడంతో పల్లెల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు పంచాయతీల్లో ఏర్పాటుచేసిన స్థాయిసంఘాలు పత్తా లేకుండా పోయాయి.
ప్రభుత్వ కార్యక్రమాల్లో, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో స్థాయీసంఘ సభ్యులకు క్రమేణ గుర్తింపు లేకుండా పోయింది.
పంచాయతీల్లో స్థాయీ
సంఘాలు ?
ఉమ్మడి రాష్ట్రంలోని విధానం
అమలుకు చర్యలు!
జిల్లాలో 545 గ్రామపంచాయతీలు


