
కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. ‘కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు’ అంటూ బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేకూరిన మేలు చేకూరిందంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్యాకేజీ 20, 21, 21ఏ(1), 21ఏ(2) పనుల కోసం రూ.6వేల కోట్లు, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్ కోసం రూ.1,750 కోట్లు కేటాయించినట్లు అందులో వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల ఫొటోలను ప్రచురించారు.
– మోర్తాడ్(బాల్కొండ)