
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన సీపీ
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బుధవారం సన్మానించారు. మాక్లూర్, నవీపేట్, మెండోరా, మోపాల్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కోటగిరి పీఎస్‌లలో 15 హత్య కేసుల్లో 11 కేసులలో నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేసినట్లు సీపీ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీ నర్సయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ వసంత్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావును సన్మానించారు.
‘స్థానిక’ ఎన్నికలపై 8న అఖిలపక్ష సమావేశం
నిజామాబాద్ రూరల్ : స్థానిక ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో ఈనెల 8వ తేదీన స మావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సమా వేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని, అన్ని పార్టీల నిర్ణయం తర్వాత ఈ నెల 10వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేస్తారని పేర్కొన్నారు.