
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
నిజామాబాద్ రూరల్: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం లభిస్తుందని సీపీ సాయి చైతన్య అన్నారు. మండలంలోని గూపన్‌పల్లి శివారులో సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సీపీ సందర్శించారు. అనంతరం చిన్ని కృష్ణుడితో మాట్లాడి సేంద్రియ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 వంగడాలతో ఏర్పాటు చేసిన సూచన చక్రాన్ని, 23 వంగడాలతో చిన్ని కృష్ణుడి వివరాలను ఏర్పాటు చేసిన తీరును అభినందించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. యువత సైతం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అన్నారు. పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.