
క్రైం కార్నర్
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి
● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు
● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సై
నిజాంసాగర్(జుక్కల్): ఓ కూతురు తన తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులు తీసుకొని, తండ్రిని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య, దుర్గవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దుర్గవ్వ, ఒక కొడుకు కొన్నెళ్ల కిందట మృతి చెందారు. మరో కొ డుకు నారాయణ పెళ్లి చేసుకొని ఇళ్లరికం వెళ్లాడు. అప్పటి నుంచి వృద్ధుడైన పోచ య్య నిజాంపేటలోని కూతురు నర్సవ్వ వద్ద ఉంటున్నాడు. నాల్గు రోజుల కిందట తండ్రి పింఛన్ కోసం నర్సవ్వ తన తండ్రిని తీసుకొని తుంకిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చింది. సిబ్బంది డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని అక్కడే వదిలివేసి వెళ్లిపోయింది. దీంతో పోచయ్య గ్రామ పంచాయతీ వద్దనే ఉన్నాడు. బుధవారం జీపీ కా ర్యాలయం వద్ద పోస్టాఫీసు సిబ్బంది పింఛన్ పంపిణీ చేస్తుండటంతో నర్సవ్వ వచ్చి, పింఛన్ డబ్బులను తీసుకొని తండ్రిని అక్కడే వదిలేసి వెళ్లింది. పోచయ్య అనాథగా మారి రోధించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఎస్సై శివకుమార్‌కు సమాచారం అందించారు. కూతురుకు ఎస్సై ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకువెళ్లాలని చెప్పారు.

క్రైం కార్నర్