
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
మోపాల్ : గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విధులను నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాస్‌రావు సూచించారు. మండలంలోని కులాస్‌పూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పల్లె ప్ర కృతివనం, నర్సరీలో నీరు నిలిచి ఉండటంతో సమస్య పరిష్కారానికి పలు సూచన లు చేశారు. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని తొ లగించాలని పంచాయతీ కార్యదర్శి హనుమరాజ్ ను ఆదేశించారు. అలాగే మురుగుకాల్వకు ఆనుకు ని ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను మార్చాలన్నా రు. వాటర్ ట్యాంకుల్లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
బోధన్: తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలను బోధించాలని డీఈవో అశోక్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని రాకాసీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేపీ) లో గురువారం మండల స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్( ఫండమెంట్ లిటరసీ), టీచింగ్ లెర్నింగ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిగా విచ్చేసి, ఉపాధ్యాయులు రూపొందించిన బోధన పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోధన పరికరాల ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఎంఈవో నాగయ్య, కాంప్లెక్స్ స్కూల్ హెచ్‌ఎంలు సూర్యకుమార్, ఆరిఫ్‌ఉద్దీన్, సీఆర్‌పీలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.