
రైళ్లను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ స్థాయి సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. సికింద్రాబాద్‌లో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పలు వినతులు అందించారు. నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు.తిరుపతికి వందే భారత్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్‌పల్లి మధ్య ట్రాక్ లింకు కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలో ప్లాట్ల యజమాన్లకు న్యాయం చేయాలన్నారు. తపోవన్ ఎక్స్‌్‌ప్రెస్, పూణే, ముంబై ఎక్స్‌్‌ప్రెస్‌లను, బెంగుళూరు, ఢిల్లీ రైళ్లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు. ముంబై సికింద్రాబాద్ మధ్య మరొక రైలు నడపాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్, సీసీ కెమెరాలు స్కానింగ్ ప్రయాణికుల వసతులు తదితర వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాల ని కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని జిల్లా బాలభవన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క ళా ఉత్సవ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. వివి ధ విభాగాలలో 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు డీఈవో అశోక్ తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.