క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 4 2025 5:51 AM | Updated on Sep 4 2025 6:33 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పిట్లం: పటాన్‌చెరు సమీపంలో బొలెరో వాహనం ఢీ కొని పిట్లం మండలం హస్నాపూర్‌కు చెందిన శివ(28) అనే యువకుడు మృతి చెందిన ఘటన బువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటాన్‌చెరు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివను వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తి..

ఖలీల్‌వాడి: సారంగపూర్‌ హనుమాన్‌ ఆలయం గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి(65–70) చెందినట్లు ఆరో టౌన్‌ ఎస్సై వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ నెల 1న గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

పేకాట స్థావరాలపై దాడి

బాల్కొండ: మండలంలోని పలు గ్రామాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్‌ బుధవారం తెలిపారు. బాల్కొండ మండలం వన్నెల్‌(బి)లోని గురడి కాపు సంఘం భవనం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏడుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 17వేల నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పై పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 4,710 నగదు, ఒక బైక్‌, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపా రు. కిసాన్‌నగర్‌లోని మేదరి సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 3,800 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పాత కలెక్టరేట్‌ ప్రాంతంలో

గంజాయి విక్రయం!

ఖలీల్‌వాడి: నగరంలోని పాత కలెక్టరేట్‌ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వచ్చినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. పాత కలెక్టరేట్‌ మైదానంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి విక్రయానికి వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రావడంతో పరారైన చోట ఉంచిన బైకులో 20 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్‌ ను సీజ్‌ చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బైక్‌, చుట్టూ పక్కల ఉండే సీసీటీవీ పుటేజీ ఆధారంగా గంజాయి అమ్మే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.

క్రైం కార్నర్‌1
1/2

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌2
2/2

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement