
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ గ్రామ చెరువులో గల్లంతైన శ్రీగంధం పోశెట్టి (62) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పోశెట్టి సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు భూమేశ్ చెరువు వద్దకు వెళ్లి వెతికాడు. పోశెట్టి బట్టలు, చెప్పులు చెరువు కట్టపై కనిపించడంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం పోశెట్టి మృతదేహం నిజాంసాగర్ కెనాల్ గేట్ల వద్ద కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.