
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్
● మధ్యప్రదేశ్ నుంచి వచ్చి
జిల్లాలో దొంగతనాలు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: మధ్యప్రదేశ్ నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ప్రమాదకర ము ఠా సభ్యుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో ఎస్పీ రాజేశ్ చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. గత జూలై 18న అర్ధరాత్రి సదాశివనగర్ మండలం మర్కల్‌లో తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీలు జరిగాయి. దీంతో బాధితులు గుండ్రెడ్డి గంగాధర్, గుర్రపు మహేశ్‌ల ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించా రు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో అనుమానితుల కదలికలపై ఆరా తీశా రు. సదాశివనగర్ మండలం కల్వరాల్ స్టేజీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపడు తుండగా పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని పట్టుకుని విచారించారు. నిందితుడు జిల్లా లో చేసిన నేరాలను అంగీకరించినట్లు తెలిపారు.
రాజస్థాన్ పాసింగ్ కారులో తిరుగుతూ..
పోలీసులకు చిక్కిన సికిందర్ సోన్లాల్ దర్బార్, అతని స్నేహితులు సంజు, విశాల్, అభిషేక్, ప్యూస్, అనిల్, ఉమేశ్ బాయ్, గోవింద్ బాయ్, మరొకరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా రాజస్థాన్ నంబర్ ప్లేట్ ఉన్న కారును కొనుగోలు చేసి, దాంట్లో ప్రయాణిస్తూ కామారెడ్డి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. చోరీలు చేసేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే క్రమంలోనే నిందితుడు పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు. నిందితుని నుంచి కారు, సె ల్‌ఫోన్, కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు సంతోష్ కుమార్, శ్రీనివా స్, ఎస్సైలు పుష్పరాజ్, ఉస్మాన్, ఐటీ కోర్ కానిస్టే బుల్ శ్రీనివాస్, సిబ్బంది లక్ష్మీకాంత్, శ్రీనివాసు, మైసయ్య, శ్రావణ్, రవిలను ఎస్పీ అభినందించారు.