
ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
నందిపేట్/రుద్రూర్/నవీపేట/బోధన్/వర్ని: బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఇంట్లో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఎడ్లు లేనివారు మట్టితో ఎడ్ల ప్రతిమలను తయారు చేసి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఎడ్లతో ఊరేగింపు నిర్వహించి, ఆలయాల చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణలు చేయించారు. పంటలు సమృద్ధిగా పండాలని అన్నదాతలు మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు రైతులను ఘనంగా సన్మానించారు. రైతులతోపాటు గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య