
ఎస్సారెస్పీ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ వద్ద పటిష్టమైన బందో బస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులకు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటిని వదులుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి వైపు వెళ్లవద్దని సూచించారు. పోలీస్‌లతో పర్యాటకులు సహకరించాలని కోరారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని, సిబ్బంది తదితరులు ఉన్నారు.