
పీఎస్‌వోల శిక్షణ ప్రారంభం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల (పీఎస్‌వో)ల శిక్షణ కార్యక్రమం పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ సాయి చైతన్య హాజరై, మాట్లాడారు. వీఐపీల భద్రత నేపథ్యంలో సేవలు అందించే పీఎస్‌వోల పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రెండు రోజుల ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, తిరుపతి, సతీ ష్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.