
పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ
నిజామాబాద్ నాగారం: నగరంలోని చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, దుబ్బాలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో బీ రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఐఎల్‌ఆర్, డీప్ ఫ్రీజర్ లో ఉంచిన వ్యాక్సిన్లు, ఐపీ, ఓపీ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం పరిధి లో డెంగీ కేసుల నమోదు, నివారణకు చేప ట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వా రానికి రెండుసార్లు డ్రైడే నిర్వహించాలని ఆ శావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పర్యవేక్షక సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట డాక్టర్లు శిఖర, సూసేన, మైత్రి, చంద్రకళ తదితరులు ఉన్నారు.