
నియామకం
నిజామాబాద్ సిటీ: జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా బైరా గణేశ్ నియమితులయ్యారు. ఈమేరకు కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా గణేశ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్య్ భూపతిరెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాకర్‌గౌడ్, రాష్ట క్రమశిక్షణ సంఘం సభ్యులు జీవీ రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.
అర్హులందరికీ
డబుల్ ఇళ్లు అందించాలి
బాల్కొండ: బాల్కొండలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తు శుక్రవారం పాత జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించా రు. మండలకేంద్రంలో 70ఇళ్లు ఇంకా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన ఇళ్లు కూడ అనర్హులకు అందించారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు డబు ల్ బెడ్ రూం ఇళ్లలోకి చొరబడటానికి ప్రయ త్నించారు. పోలీసులు అడ్డుచెప్పడంతో రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై వాహనాలు గంట పాటు నిలిచిపోయాయి.

నియామకం