ఏసీబీ గుబులు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ గుబులు

Aug 23 2025 12:42 PM | Updated on Aug 23 2025 12:42 PM

ఏసీబీ గుబులు

ఏసీబీ గుబులు

విద్యాశాఖలో

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా విద్యాశాఖ అధికారు ల్లో ఏసీబీ గుబులు మొదలైంది. పరిపాలనా వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధుల దారి మళ్లింపు, త ప్పుడు బిల్లులతో లక్షల్లో నొక్కేసినట్లు తెలుస్తోంది. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వారం రోజులుగా ఉద్యోగులను విచారిస్తుండడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అక్రమాల్లో పాలుపంచుకున్న అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

శిక్షణ పేరిట భక్షణ?

వేసవి సెలవుల్లో జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మూడు విడతలుగా 15 రోజులపాటు కొనసాగాయి. ఇందులో 5,611 మంది టీచర్లు, 358 మంది రీసోర్స్‌ పర్సన్లు, 60 మంది ప్రైమరీ స్కూల్‌ టీచర్లు, 60 మంది క్లర్కులు, 175 మంది అటెండర్లు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు రూ.2 కోట్ల 75 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందులో సెంటర్‌ ఇన్‌చార్జికి రోజుకు రూ.2500 కేటాయించాలి. కానీ, కొందరికి మా త్రమే ఈ గౌరవ వేతనాన్ని అందజేశారు. మరోవైపు ప్లేట్‌ భోజనానికి రూ.75 ఖర్చు చేసి, నివేదికలో మాత్రం రూ.165గా నమోదు చేశారు. అంతేకాకుండా బిల్లుల కోసం హెచ్‌ఎంలు, సెంటర్‌ కోఆర్డినేటర్లతో బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిసింది. అక్రమాలు తెలిసి నిలదీసిన మహిళా హెచ్‌ఎంను బెదిరించగా, మరో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకున్నారు. సెంటర్‌ కోఆర్డినేటర్ల కేటాయింపుల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కినట్లు తెలిసింది. వారికి అనుకూలంగా ఉండేవారిని కోఆర్డినేటర్లుగా నియమించి, బిల్లులపై తేలికగా సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. ఇలా టీచర్ల శిక్షణ కార్యక్రమాల్లోని రూ.48 లక్షలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే ఓ అధికారి నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీ సుదీర్ఘ విచారణ

జిల్లా విద్యాశాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ సుదీర్ఘ విచారణ చేపడుతోంది. ఉద్యోగులను ఒక్కొక్కరిగా పిలుస్తున్న ఏసీబీ అధికారు లు, లిఖితపూర్వకంగా వివరాలు సేకరిస్తున్నా రు. సస్పెన్షన్‌కు గురైన టీచర్లకు మళ్లీ విధుల కే టాయింపు, టీచర్ల శిక్షణ కార్యక్రమం, కేజీబీవీ టీ ఎల్‌ఎం కొనుగోలు తదితర వాటికి కేటాయించి న నిధుల వివరాలను సేకరించారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

భవిత కేంద్రాల్లో అక్రమ వసూళ్లు

జిల్లాలోని ఒక్కో భవిత కేంద్రంలో వివిధ ఆట వస్తువుల కొనుగోలుకు ఇటీవల రూ.2 లక్షలు కేటాయించారు. సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తికి కొనుగోలు ప్రక్రియను అప్పగించారు. ఈ వ్యవహారంలో జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగి ఒకరు కీలకపాత్ర పోషించి టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్‌ ఇచ్చేలా చేశారు. కాగా, ఆ వ్యక్తి సగం వస్తువులనే కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఒక్కో కేంద్రం నుంచి రూ.25 వేల చొ ప్పున ముందస్తుగానే తీసుకొని వస్తువులను తర్వాత పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నా యి. భవిత కేంద్రం మరమ్మతు పనుల్లోనూ అదే తరహా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఓ మండలంలో భవిత కేంద్రం భవన నిర్మాణ పనులు సొంత బంధువుకి అప్పగించినట్లు ఆరోపణలున్నాయి.

కేజీబీవీలలో నిధుల గల్లంతు

జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు నోటుబుక్కులు, టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ పంపిణీకి సంబంధించి ఒక్కో కేజీబీవీకి రూ.90 వేలు కేటాయించారు. టెండర్ల ద్వారా సామగ్రి పంపిణీ చేయాల్సి ఉండగా, అవే మీ లేకుండానే కామారెడ్డికి చెందిన ఒకరికి పంపిణీ బాధ్యత అప్పగించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా లక్షలు ముట్టజెప్పారు. ఈ వ్యవహారం రాష్ట్ర అధికారులకు తెలియడంతో కేజీబీవీ ఇన్‌చార్జితోపాటు ఓ అధికారికి మె మోలు జారీ చేశారు. కానీ, సదరు కాంట్రాక్టర్‌ నుంచి ఉద్యోగులు కమీషన్‌ వసూలు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది.

నిధుల పక్కదారిపై విచారణ

టీచర్ల శిక్షణలో రూ.48 లక్షల

నిధులు మాయం

రూ.75 ప్లేట్‌ భోజనం ఖర్చును

రూ. 165గా నమోదు చేసిన వైనం

టెండర్లు లేకుండానే నోట్‌ బుక్కులు,

టీఎల్‌ఎం మేళా పరికరాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement