
జిల్లాలో యూరియా కొరత లేదు
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్
నిజామాబాద్ రూరల్: జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. నగర శివారులోని ఖానాపూర్ వద్ద గోదాంలలో నిల్వ ఉంచిన యూరియాను శుక్రవారం ఆయన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటికే 6,700 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా 4 వేల టన్నులు రావాల్సి ఉందన్నారు. మరో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు యూరియాపై అనవసరంగా రాజకీయం చేస్తున్నాయన్నారు. రైతుల పక్షాన ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైన బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు.
త్వరలో చేపపిల్లలను పంపిణీ చేస్తాం
బాల్కొండ: మత్స్య సహకార సంఘాలకు త్వరలో చేపపిల్లలను పంపిణీ చేస్తామని మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ జలాశయం వద్ద ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఎఫ్‌డీవో దామోదర్‌తో కలిసి పరిశీలించారు. ప్రస్తుత సీజన్‌లో 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా, 40 లక్షల చేపపిల్లలు మాత్రమే ఉత్పత్తి అయినట్లు వెల్లడించారు. చేపపిల్లలను అంగుళం సైజు వరకు పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం చేపపిల్లల ఉత్పత్తి సీజన్ ముగిసిందన్నారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేస్తే ఎక్కువ మొత్తంలో చేపపిల్లలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తామన్నారు. మత్స్య సహకార సంఘాలు అధికారులకు సహకరించాలన్నారు.
అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నవీపేట: స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో సె ప్టెంబర్ 28 నుంచి గు జరాత్‌లో నిర్వహించే 11వ ఏషియన్ అక్విటిక్ చాంపియన్‌షిప్ 2025 పోటీలకు మండలంలోని బినోల గ్రామానికి చెందిన మిట్టపల్లి రిత్విక భారత దేశం తరపున ఎంపికై ంది. స్విమ్మింగ్ షెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ మోనాల్‌చౌక్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆమె తండ్రి ప్రకాష్‌రావ్ తెలిపారు. భారతదేశం తరపున రిత్విక ఎంపికవడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్త, స్విమ్మింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమేష్, మైపాల్‌రెడ్డి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో యూరియా కొరత లేదు

జిల్లాలో యూరియా కొరత లేదు