
సహకార సంఘాలకు ఊతం
రెంజల్(బోధన్): రైతుల భాగస్వామ్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. విండోలను స్వయం ప్రతిపత్తి సంఘాలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీఎస్) ద్వారా కార్యాచరణ రూపొందించింది. మూడు సంవత్సరాల పాటు మొదటి విడతలో ఎంపిక చేసిన విండోలకు ఆర్థికసాయం అందించేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా జిల్లాలో సహకార శాఖ ఆడిట్ లెక్కల ఆధారంగా 12 సంఘాలను అధికారులు ఎంపిక చేయగా, ఆయా సంఘాల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షల 18 వేలను జమచేసింది. మూడు సంవత్సరాల్లో మొత్తం రూ.18 లక్షలను అందించనుంది. మంజూరైన నిధులను కార్యాలయం అద్దె, కంప్యూటరీకరణ, ఉద్యోగుల వేతనాలు అందించేందుకు ఖర్చుచేయనున్నారు.
రూ.2 వేలతో సభ్యత్వం
జిల్లాలోని సహకార సంఘాలు ప్రస్తుతం మార్క్‌ఫెడ్, హాకా, డీసీఎంఎస్ సంస్థల ప్రోత్సాహంతో పని చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, మందుల విక్రయం ద్వారా పలు సంఘాలు లాభనష్టాలను ఎదుర్కొంటున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్‌సీడీఎస్ మొదటి విడతలో రైతులకు అందించిన సేవలను గుర్తించి లాభాల బాటలో ఉన్న జిల్లాలోని 12 సంఘాలను ఫుడ్ ఫార్మెషన్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) కింద ఎంపిక చేశారు. ఈ విండోల్లోని వంద మంది రైతులను సభ్యులుగా చేర్పించి ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేలు సభ్యత్వ రుసుముగా సేకరించాలి. రైతుల నుంచి సేకరించిన మొత్తానికి అంతే సమానంగా ఎన్‌సీడీఎస్ అందిస్తోంది. రెండూ కలిపి బ్యాంకు ఖాతాలో జమచేసి రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ వ్యాపారం ప్రారంభించి వచ్చిన లాభాన్ని రైతులకు అందించనున్నారు.
జిల్లాలో ఎంపిక చేసిన సహకార సంఘాలు
మండలం పేరు సొసైటీ
కోటగిరి కోటగిరి
మాక్లూర్ మాక్లూర్
మోస్రా మోస్రా
ముప్కాల్ బాడ్సి
నిజామాబాద్‌రూరల్ మాధవనగర్
నిజామాబాద్ సౌత్ నిజామాబాద్
రెంజల్ దూపల్లి
రుద్రూర్ రుద్రూర్
వేల్పూర్ వేల్పూర్
ఎడపల్లి జాన్కంపేట్
ఏర్గట్ల తాళ్లరాంపూర్
ఇందల్వాయి నల్లవెల్లి
రైతులపై భారం పడకుండా చూడాలి
రైతులపై భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. 100 మంది రైతుల నుంచి రూ. 2వేల చొప్పున సభ్యత్వ రుసుం వసూలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వమే సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. మా సొసైటీని ఎంపిక చేసినందుకు డీసీసీబీ చైర్మన్, డీసీవోలకు కృతజ్ఞతలు. – భూంరెడ్డి, దూపల్లి విండో చైర్మన్
సంఘాలకు తోడ్పాటు
సహకార సంఘాలకు తోడ్పాటును అందించేందుకు మొదటి విడతలో 12 విండోలను ఎంపిక చేశాం. ఎంపికై న విండోలకు ఇప్పటికే నిధులను విడుదల చేశాం. జిల్లాలో 89 సహకార సంఘాలున్నాయి. విడతల వారిగా ప్రతీ సంఘాన్ని ఎంపిక చేస్తాం. – శ్రీనివాస్, డీసీవో
ఎఫ్‌పీవోలుగా 12 పీఏసీఎస్‌లు ఎంపిక
రైతుల భాగస్వామ్యంతో బలోపేతానికి కేంద్రం చర్యలు
ఎంపికై న సొసైటీల ఖాతాల్లో
రూ. 3.16 లక్షలు జమ

సహకార సంఘాలకు ఊతం