
గర్భిణుల్లో రక్తహీనత తగ్గించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: గర్భిణుల్లో రక్తహీనత తగ్గించాలని, అప్పుడే శిశు మరణాలు తగ్గుతాయని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ సంబంధిత అధికారులు, సి బ్బందిని ఆదేశించారు. శిశు మరణాలపై శుక్రవా రం ఆమె కార్యాలయంలో జిల్లాస్థాయి సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడు తూ జిల్లాలో శిశు, చిన్నారుల మరణాలు జరగకుండా వైద్యాధికారులు, సూపర్‌వైజర్ స్టాఫ్, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణుల పేర్లను 12 వారాలలోపు నమోదు చేసుకొ ని రక్తహీనత, బరువును సమీక్షిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్యుల ద్వారా నాలుగుసార్లు పరీక్షలు చేయించడంతోపాటు టీకా లు ఇప్పించాలని తెలిపారు. ఆరు నెలల వరకు కేవ లం శిశువుకు తల్లి పాలు పట్టేలా చైతన్యప ర్చాలని సూచించారు. బర్త్ ప్లానింగ్‌లో భాగంగా గర్భిణుల ను ముందుగానే ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. త్వరలో కలెక్టర్ అధ్యక్షతన శిశు మర ణాలపై సమీక్ష ఉంటుందని, అందరూ పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అంజన, రమేశ్, పీవోఎంసీహెచ్ శ్వేత, పిల్లల వైద్య నిపుణులు కీర్తి, నవీన్, సీ్త్ర వైద్య నిపుణులు కీర్తి, మత్తు వైద్యుడు సుజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.