
కాడెద్దుల సంబురం
● ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
జిల్లా వ్యాప్తంగా రైతన్నలు శుక్రవారం పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకొన్నారు.
పండుగను పురస్కరించుకొని ఎడ్ల కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. గ్రామాల్లోని ఆలయాల చుట్టూ బసవన్నలతో ప్రదక్షిణలు చేయించారు. ఎడ్లకు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. పలు గ్రామాల్లో ఎడ్లతో శోభాయాత్ర నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను తిలకించారు.

కాడెద్దుల సంబురం