
‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్
డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ
మోపాల్: గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతర కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూ టీ కమిషనర్ జాన్ వెస్లీ సూచించారు. పనుల జాత ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాడెం గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్‌పీవో శ్రీనివాస్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో ప్రగతి కోసం పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో కిరణ్‌కుమార్, ఏపీవో సునీత, పంచాయతీ కార్యదర్శి మృదుల, జూనియర్ అసిస్టెంట్ భోజన్న తదితరులు పాల్గొన్నారు.