
‘ప్రో కబడ్డీ చాంపియన్’ శిబిరం ప్రారంభం
బాల్కొండ: యువ తెలంగాణ ప్రో కబడ్డీ చాంపియ న్– 2025 క్యాంపు బుధవారం ముప్కాల్ భుదేవ్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంద్యాల లింగయ్య, కె.గంగాధర్ మాట్లాడుతూ ప్రో కబడ్డీ లీగ్‌లో ఎనిమిది జట్లు పా ల్గొంటున్నాయని, అందులో ‘శాతవాహన సైనిక్’ జట్టును జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. జట్టు క్రీడాకారులకు భుదేవ్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ వరకు చీఫ్ కోచ్ ప్రశాంత్ శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల నిర్వహణ అధికారి పవన్ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంగారెడ్డి, ముస్కు భూమేశ్వర్, బద్దం నర్సారెడ్డి, ముస్కు మోహన్, ఎన్.అంజయ్య, పీడీ రాజ్‌కుమార్, పీఈటీ అన్వేష్, టీ సాయన్న, గోపీనాథ్, రఫీ, ముఖీద్, పోశెట్టి, గైని రమేశ్, గొర్రె రాములు తదితరులు పాల్గొన్నారు.
మినీ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం
ఆర్మూర్‌టౌన్: క్రీడాకారులకు అనుగుణంగా మినీ స్డేడియాన్ని అన్ని విధాల ఆధునీకరిస్తామని జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి పవన్‌కుమార్ పే ర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ, ఇండోర్ స్టేడియాలను ఆయన బుధవారం పరిశీలించారు. త్వరలోనే క్రీడా మైదానాలను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ప్లే ఫీల్డ్‌లని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట సీనియర్ పీడీ గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.