రోడ్డు ప్రమాదంలో పాల్వంచ వాసి మృతి
మాచారెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం పాల్వంచ మర్రి గ్రామానికి చెందిన కడమంచి వెంకటి(57)మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటి తన బైక్‌పై పని మీద సిరిసిల్ల జిల్లా సముద్ర లింగాపూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారుడ్రైవర్ అతివేగంతో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు వెంకటి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు.
అదృశ్యమైన మహిళ శవం లభ్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడికిందిపల్లెకు చెందిన ఇరగదిండ్ల చిన్నక్క(42) మృత దేహం లభ్యమైనట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. ఈ నెల 5న చిన్నక్క అదృశ్యమైనట్లు కుటుంబసభ్యు లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చే శామన్నారు. బుధవారం రాంపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం వ చ్చిందన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మహిళ మృతదేహం కుళ్లిపోయినట్లు తెలిపారు. మృతురాలిని హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్