
జక్రాన్‌పల్లి వీడీసీ భవనంపై గ్రామస్తుల ఫిర్యాదు
● విచారణకు ఆదేశించిన న్యాయసేవా సంస్థ
నిజామాబాద్ లీగల్: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, అద్దె వసూలు చేసుకుంటున్న వీడీసీపై న్యాయసేవా సంస్థకు గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్‌ను విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో 1982–87 పంచాయతీ పాలకవర్గం బీఎస్‌ఎన్‌ఎల్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించింది. 2020–21లో వీడీసీ ఆ స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా 8 మడిగెలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. మడిగెలను వైన్స్, పర్మిట్‌రూంలకు అద్దెకు ఇచ్చి డబ్బులను వీడీసీ వసూలు చేస్తోంది. ఐతే, మడిగెలు నిర్మించిన స్థలం ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తులదా? తేల్చాలని, నిర్మాణాలకు జీపీ అనుమతులపై న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు విచారణకు ఆదేశించారు. పర్మిట్ రూంలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ రావుకు సూచించారు.