
ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గో దావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు త గ్గించారు. బుధవారం ఉదయం నుంచి ప్రాజెక్టులో కి వరద క్రమంగా తగ్గుముఖం పడుతూ సాయంత్రానికి లక్షా 50వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో గోదావరిలోకి నీటి విడుదలను తగ్గిస్తూ.. సాయంత్రానికి 16 గేట్ల ద్వారా 52వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉన్నా అవుట్ ఫ్లో మాత్రం తగ్గించి, ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని క్రమంగా పెంచుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి గో దావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండటంతో సందర్శనకు పర్యాటకులు తరలివచ్‌చ్రాు. డ్యామ్‌పైకి అనుమతులు ఇవ్వడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.
కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 20 వేలు, ఎ స్కెప్ గేట్ల ద్వారా 3 వేలు, కాకతీయ కాలువ ద్వారా 5వేలు, లక్ష్మి కాలువ ద్వారా 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూ పంలో 692 క్యూసెక్కులు పోతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1088.10 (70.10 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.