ఇదోరకం మోసం.. ‘కారు’చౌక బేరం.. | - | Sakshi
Sakshi News home page

ఇదోరకం మోసం.. ‘కారు’చౌక బేరం..

Aug 21 2025 6:42 AM | Updated on Aug 21 2025 6:42 AM

ఇదోరకం మోసం.. ‘కారు’చౌక బేరం..

ఇదోరకం మోసం.. ‘కారు’చౌక బేరం..

కామారెడ్డి క్రైం: మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్‌ నంబర్లు, ఆర్సీ త యారు చేసి ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్‌ గౌడ్‌ ఫేస్‌బుక్‌ అప్లికేషన్‌లో చూసి సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రయించిన వ్యక్తు లకు ఫోన్‌ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మో సం వెలుగు చూసింది.

ముఠాగా ఏర్పడి..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్‌కు చెందిన మహమ్మద్‌ ఇయాజ్‌, వికారాబాద్‌లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్‌ జాహీద్‌ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్‌, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్‌, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్‌, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్‌ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్‌ ప్లేట్‌లు మార్చేసి నకిలీ ఆర్‌సీ, ఇతర పత్రా లు సృష్టిస్తారు. ఆపై ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటా రు. కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్‌ ట్రాక ర్‌ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు.

నిందితులపై పలు కేసులు..

నిందితులు గతంలోనూ పలు చోట్ల నేరాలకు పా ల్పడినట్లు విచారణలో తేలింది. మాచారెడ్డిలో కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించామన్నారు. మరో నిందితుడు అలీ ఇంకా పరారీ లో ఉన్నాడన్నారు. నిందితుల నుంచి మూడు కా ర్లు, 15 సెల్‌ఫోన్‌లు, జీపీఎస్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌, 10 మైక్రో సిమ్‌కార్డులు, చిప్‌ కార్డులు, ఫో ర్జరీ చేసిన ఆర్‌సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్‌ సీఐ రా మన్‌, ఎస్సై అనిల్‌, ఐటీ సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీ నివాస్‌, సిబ్బంది సుభాష్‌రెడ్డి, సిద్దిరాములు, శ్రీ కాంత్‌లను అభినందించారు. సమావేశంలో కామా రెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అద్దెకు తెచ్చి.. ఫేక్‌ నంబర్‌ తయారుచేసి.. తక్కువ ధరకు విక్రయం

ఆపై అదే కారును చోరీ చేసి..

యజమానికి అప్పగిస్తున్న వైనం

ఆరుగురు నిందితుల అరెస్ట్‌,

పరారీలో మరొకరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement