తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సె ల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో 2,366 మంది విద్యార్థులకు 2,240 మంది హాజరుకాగా 126 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో మొత్తం 1,444 మంది విద్యార్థులకు 1,379 మంది హాజరుకాగా 65 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్ తెలిపారు.
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నిజామాబాద్‌నాగారం: దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పేర్కొన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని దుబ్బా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్ గున్యా, మెదడువాపు లాంటి వ్యాధులను నివారించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హజ్మతున్నీసా బేగం, శిఖర, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెచ్‌ఈవోలు నటరాజ్ గోవర్ధన్, లింబారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బాలుడి అప్పగింత
మోపాల్: మండలంలోని కులాస్‌పూర్ గ్రామానికి చెందిన బొద్దుల వరుణ్‌ను ఆయన తాత వడ్డేపల్లి గంగాధర్‌కు ఎస్సై జాడె సుస్మిత బుధవారం అప్పగించారు. వరుణ్ అదృశ్యమయ్యా డని గంగాధర్ మంగళవారం పోలీసులకు ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు వరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి మోపాల్ పోలీసులకు అప్పగించారు. అనంత రం మోపాల్ పోలీసులు వరుణ్‌ను ఆయన కు టుంబసభ్యులకు బుధవారం అప్పజెప్పారు.
లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
నిజామాబాద్ అర్బన్: మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. బాల్కొండ, ఆలూరు, ధర్మపురి హిల్స్, కోటగిరి గురుకుల పాఠశాల లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎంఏ, బీఈడీ అర్హత ఉండాలని తెలిపారు. ఈ నెల 23వ తేదీలోపు నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. పూర్తి వివరాలకు 9849419469 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.