
ఆగస్టులోనే పూసే ‘అగ్ని శిఖ’ పుష్పం
మీకు తెలుసా?
వేసవిలో పూసే ‘మే’ పుష్పం మాదిరిగా ఆగస్టు మాసంలోనే పూసే మరో రకం పుష్పం ఉంది. దాని పేరే అగ్ని శిఖ (కలంగటి పువ్వు). దీనికి ‘గ్లోరీ లిల్లి’ అనే మరో శాసీ్త్రయ నామం కూడా ఉంది. ఇది ‘కొల్చి కేసియే’ అనే కుటుంబానికి చెందిన మొక్క. మొత్తం 11 రకాల జాతుల్లో ‘అగ్ని శిఖ’ ఒకటి.
● ఇది భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో అలాగే సముద్రపు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వర్షాకాలంలో రుతుపవనాలకు అనుకూలంగా ఉండి పుష్పాలు పూస్తాయి.
● ఇది తమిళనాడు రాష్ట్ర పుష్పం కూడా. మొక్క మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, ముదురు గులాబీ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
● వినాయక చవితి పండుగకు ముందు ఇవి భారీగా వికసిస్తాయి. అందుకే వీటిని ‘ఎంకయ్య పువ్వు’ అని కూడా అంటారు. చవితి రోజు గణపతిని ఈ పుష్పాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఎడ్లపొలాల అమావాస్య నాడు కూడా వీటిని రైతులు పూజకు ఉపయోగిస్తారు. ఇలా చేయడం పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
● పవిత్రంగా భావించే ఈ మొక్కను విషపూరితమైనదిగా పరిగణిస్తారు. మనుషులు, పశువులు తినకూడదంటారు. కానీ, దీనిని ఆర్థరైటిస్, అల్సర్, కు ష్టు, పైల్స్, కడుపునొప్పి, చర్మ సంబంధిత, ఇత ర చాలా రకాల వ్యాధులకు ఉపయోగిస్తారట.
– డొంకేశ్వర్(ఆర్మూర్)