
బీజేపీలో కార్యకర్తలకు సముచిత స్థానం
● జాతీయ పసుపు బోర్డు
చైర్మన్ పల్లె గంగారెడ్డి
సుభాష్‌నగర్: బీజేపీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మహాజన సంపర్క్ అభియాన్ జిల్లా సమావేశం పార్టీ అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశానికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నా యకులు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బూత్ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీ అర్వింద్ కార్యకర్తల సంక్షేమానికి ప్ర త్యేక నిధి ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. బలమైన బూత్ ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలవడం సులభమన్నారు. దొంగ ఓట్ల విషయమై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, జెడ్పీపై కా షాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షు డు దినేశ్ పటేల్ కులాచారి ఆశాభావం వ్యక్తంచేశా రు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.