
‘సాహిత్యం సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది’
నిజామాబాద్ రూరల్: ఉత్తమమైన సాహిత్యం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించి పౌరులందరినీ బా ధ్యతతో నిలిచేలా చేస్తుందని డీఈవో అశోక్ అన్నా రు. బోర్గాం(పి) సమీపంలోని శ్రీ లక్ష్మీగణపతి ఆల యంలో బుధవారం జిల్లా స్థాయి కవి సమ్మేళనం, చింతల శ్రీనివాస గుప్త సంపాదకత్వంలో వెలువడి న ‘వేసవి సెలవులు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ అధ్యక్షతన జరిగిన కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో అశోక్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సాహిత్యరంగంలో మున్ముందుకు సాగుతుందన్నారు. నిజామాబాద్ కవులు అన్ని ఉద్యమాలలో ప్రముఖంగా నిలి చి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. ‘వేసవి సెలవులు’ పుస్తకంలో 21 మంది ప్రముఖ కవులందరూ కలిసి బాల్యాన్ని చిత్రీకరిస్తూ చక్కటి కవితలు రాశారన్నారు. అనంతరం పుస్తక సంపాదకులు చింతల శ్రీనివాస గుప్తను అభినందించారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత వీపీ చందన్ రావు, కవులు డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కంకణాల రాజేశ్వర్, స్వర్ణ సమత, వసంతా లక్ష్మణ్, కే రజిత, డాక్టర్ ఏ జ్యోతి, రామ్ నరేశ్, విట్టం ధనుంజయ, ఎలగందుల లింబాద్రి, శంకర్, బట్టు శ్రీధర్ రాజు, రివర్స్ గేర్ నవీన్, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ కవితలను వినిపించారు.