
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖలీల్‌వాడి: నగరంలోని సారంగపూర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద గంజాయిని ఆటోలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని సారంగపూర్‌కు చెందిన సయ్యద్ వాసీం చిన్న ప్యాకెట్లను ఏర్పాటు చేసుకొని గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సారంగపూర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటోను ఆపి తనిఖీలు నిర్వహించగా వాసీం వద్ద 100 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ను, ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది రామ్‌కుమార్, హమీద్, విష్ణు, అవినాష్, భోజన్న ఉన్నారు.