
ఎరువుల కొరత లేదు
పెర్కిట్(ఆర్మూర్): వానకాల సీజన్‌కు ఎరువుల కొరత లేదని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఆలూర్ మండల కేంద్రంలోని సొసైటీ గోదామును డీసీవో మంగళవారం తనిఖీ చేశారు. గోదాములో ఎరువుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానకాల సీజన్‌లో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగినంత యూరియా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అలాగే రైతులు తమ అవసరాలకు అనుగుణంగా యూరియాను తీసుకోవాలని సూచించారు. సొసైటీ వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సెక్రెటరీ మల్లేష్, సిబ్బంది ముత్యం, సురేష్, సీతగంగారాం, రైతులు పాల్గొన్నారు.