
బోధన్‌లో కలకలం రేపిన రేసింగ్ పావురం
బోధన్‌రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో కోడింగ్ స్టిక్కర్‌తో ఉన్న పావురం కలకలం రేపింది. మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఓ బాలుడు ఆడుకుంటుండగా పావురం దొరికింది. ఆ పావురం కాలికి, రెక్కలకు కోడింగ్ నెంబర్‌లతో ఉన్న స్టిక్కర్‌లు ఉన్నాయి. దీంతో ఆ పావురం గూఢచారి పావురం అంటూ ప్రచారం జరిగింది. గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ తీసుకొచ్చారు. ఈ పావురం రేసింగ్ గేమ్‌కు సంబంధించినదని ఎస్సై తెలిపారు. పావురాన్ని పరిశీలించి వదిలేసినట్లు చెప్పారు. ఎటువంటి కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఈ పావురం ఘటన మంగళవారం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ ప్రాంతీయ (కామారెడ్డి, నిజామాబాద్) సైనిక సంక్షేమ జిల్లా అధికారిగా మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇన్‌చార్జిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాధ్యతల స్వీకరించి విషయం తెలిసిందే. గత నెల 31న ఆయన పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు.