
గంటగంటకు పెరిగిన వరద
బోధన్/రెంజల్: మంజీ ర, గోదావరి నదులు ఉ ప్పొంగుతున్నాయి. సో మవారం సాయంత్రం 4 గంటలకు సాలూర శివారులోని పాత వంతెన పైనుంచి మంజీర ప్రవ హించింది. వరద ఉధృతి సోమవారం రాత్రి వేళ మరింత పెరిగే అవకాశం ఉంది. పాత వంతెన మీదుగా రాకపోకలు సాగించకుండా నది అవతలి వైపు మహారాష్ట్ర అధికారులు మట్టివేసి రోడ్డును మూసివేశారు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్ మంజీరను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని ప్రవహిస్తోంది. గంటగంటకూ వరద పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.