
చట్టాలపై అవగాహన అవసరం
● మూట్ కోర్టులో న్యాయవాది రామాగౌడ్
తెయూ(డిచ్‌పల్లి): మారుతున్న కాలంలో న్యాయ విద్యార్థులు సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది రామాగౌడ్ సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో సోమవారం నిర్వహించిన మూట్ కోర్ట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన రామాగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రిమినల్ కేసులలో నిందితుల హక్కులు, చట్టంలో వారికి సంబంధించిన నిబంధనలను వివరించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొందరు, నిందితుల తరఫున కొందరు న్యాయ విద్యార్థులు వాద ప్రతివాదనలు వినిపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, హెచ్‌వోడీ కే ప్రసన్న రాణి, బీవోఎస్ చైర్మన్ బీ స్రవంతి, అధ్యాపకులు ఎం.నాగజ్యోతి, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.