
బేస్‌బాల్ పోటీల్లో ఇందూరు మహిళలు ఫస్ట్
● తృతీయ స్థానంలో నిలిచిన
బాలుర జట్టు
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 16, 17 తేదీల్లో 5వ తెలంగాణ సీనియర్ బేస్‌బాల్ మహిళల, పురుషుల పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో నిజామాబాద్, హైదరాబాద్ జట్లు ఫైనల్స్‌లో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. పురుషుల విభాగంలో జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బేస్‌బాల్ జనరల్ సెక్రెటరీ శ్వేతా, ట్రెజరర్ డాక్టర్ కె.కృష్ణ, ఆదిలాబాద్ బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కాలా శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీలో బెస్ట్ క్యాచర్ అవార్డును సుద్దపల్లిలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఎస్‌కు చెందిన లిఖిత అందుకున్నారు. విజేతలను జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎల్ మధుసూదన్ రెడ్డి, సొప్పరి వినోద్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్ రెడ్డి, మల్లేశ్ గౌడ్ తదితరులు అభినందించారు.