
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన వీసీ, రిజిస్ట్రార్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం రెండోరోజు కొనసాగాయి. క్యాంపస్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట కళాశాల ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్ ఉన్నారు. ఉదయం జరిగిన పీజీ పరీక్షలకు 2,357మంది విద్యార్థులకు గాను 2,228 మంది హాజరుకాగా 129 మంది గైర్హాజరైనట్లు ఆడిట్‌సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ, బీపీఎడ్ పరీక్షలకు 1,487 మంది విద్యార్థులకు గాను 1,418మంది హాజరుకాగా 69 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.