
సాకు చూపి.. మాట మార్చి
● సీడ్ రకం పండించిన రైతులకు
తగ్గిన ఆదాయం
● సర్కారు బోనస్ ఇవ్వలేదంటూ
అదనపు డబ్బులు చెల్లించని వ్యాపారులు
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన సన్నరకాలకు బోనస్ ఇవ్వలేదనే సాకును చూపుతున్న సీడ్ కంపెనీలు కూడా అదనంగా చెల్లిస్తామన్న సొమ్ము విషయంలో మాట తప్పుతున్నాయి. ప్రభుత్వం బోనస్ ఇస్తేనే తాము కూడా అదనపు సొమ్మును చెల్లిస్తామని లేకుంటే ఇవ్వబోమని కంపెనీలు స్పష్టం చేస్తుండటంతో సీడ్ రకం వరి సాగు చేసిన రైతులకు లాభం తగ్గింది.
సీడ్ కంపెనీల కోసం ప్రత్యేక శ్రద్ధ
సాధారణ రకాలను సాగు చేసే రైతులు సీడ్ కంపెనీల కోసం వరి సాగు చేస్తే మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలుకు ఎక్కువ ధర చెల్లించడమే కాకుండా సీడ్ ధాన్యం ఎండబెట్టడంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యంలో తేమ శాతం 12 ఉంటేనే సరిపోతుంది. సీడ్ కంపెనీలకు మాత్రం 18శాతం తేమ తక్కువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. బెరుకులు లేకుండా ధాన్యంను జల్లెడ పట్టి సంచుల్లో నింపుతారు. సీడ్ రకానికి, సాధారణ రకం వరి ధాన్యం సాగు చేసేందుకు తేడా ఉన్నా కంపెనీలు మాత్రం ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడాన్ని సాకుగా చూపుతూ అదనపు సొమ్ము చెల్లించకుండా మొండికేయడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మోర్తాడ్‌కు చెందిన రైతు ఏనుగు రాజేశ్వర్‌కు సంబంధించిన 145 క్వింటాళ్ల ధాన్యానికి రూ.500ల చొప్పున, రూ.72,500లను సీడ్ కంపెనీ యాజమాన్యం జమ చేయాల్సి ఉంది.