
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
నస్రుల్లాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన జల్ల నర్సింలు(52) కామిశెట్టిపల్లిలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని జాతీయ రహదారి 765డీ పై సైకిల్ నడుపుతూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలుపగా నర్సింలును బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే నర్సింలు మరణించినట్లు నిర్ధారించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కుంటలో పడి ఒకరు..
నవీపేట: మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన బోడాసు ఎల్ల య్య (50) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందినట్లు ఎస్సై తి రుపతి సోమవారం తెలిపారు. చెరువులోని పూలను అమ్ముకొని జీవనం సాగించే ఎల్లయ్య ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సో మవారం ఉదయం ఫకీరాబాద్ సమీపంలోని కుంటలో ఎల్లయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వర్ని: మండలంలోని హుమ్నాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. డీకొండ శ్యామల ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పరుపు కింద దాచిన రూ.10 వేలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, ఇంటిని కూల్చిన కేసులో ఆరుగురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టీ శ్రీనివాస్ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందిన పత్రి పోశన్న తన చిన్నమ్మ, చిన్న నాన్నలకు పిల్లలు లేకపోవడంతో వృద్ధాప్యంలో సేవలు చేశాడు. దీంతో వారు తమ తదనంతరం ఇంటిని పోశన్నకు ఇచ్చారు. ఐతే, ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని విజయ అనే మహిళ పోశన్న కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుంది. రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రమాకాంత్, పిప్రి గ్రామానికి చెందిన అరిగెల జనా ర్దన్, కొంపల్లి మల్లేశ్, భీమ్‌గల్ గ్రామానికి చెందిన గంగాధర్, రాధ, రామన్నపేట్‌కి చెందిన విజయలు 2015 జూన్ 19న పొక్లెయిన్‌తో పోశన్న ఇంటిన కూల్చి వేసి, కులం పేరుతో దూషించారు. దీంతో పోశన్న కుటుంబసభ్యులు మోర్తాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు పంపారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు రమాకాంత్, జనార్దన్, మల్లేశ్‌లకు రూ.ఐదు వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్సీలైన గంగాధర్, విజయ, రాధలకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బంటు వసంత్ వాదించారు.
ఖలీల్‌వాడి: నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్‌ను సీసీఎస్‌లో కలిపినట్లు పోలీస్‌వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో పేకాట, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, మొరం దందాలు, మట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు చేసేది. ఐతే, ఈ విభాగాన్ని సీసీఎస్ చూడనున్నట్లు తెలిసింది. సీఐ, ఎస్సై, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు పనిచేసే టాస్క్‌ఫోర్స్‌కు సరైన సమాచారం రావడం లేద నే ఉద్దేశంతో తాత్కాలికంగా తీసివేసినట్లు సమాచారం. గతంలో సీపీగా కల్మేశ్వర్ ఉన్న సమయంలో సిబ్బందిపై ఆరోపణలు రావడంతో వారిపై బది లీ వేటు వేశారు. కొన్ని నెలలపాటు టాస్క్‌ఫోర్స్ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. సీపీగా పోతరాజు సాయిచైతన్య వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌కు సిబ్బందిని కేటాయించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ మళ్లీ ప్రారంభమైంది. కాగా, టాస్క్‌ఫోర్స్ చేసే పనులను ప్రస్తుతం సీసీఎస్ ద్వారా చేయనున్నట్లు తెలుస్తోంది.