
ఏ వాహనానికి ఏ నెంబర్ ప్లేట్
మీకు తెలుసా?
ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని తిప్పుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానా వేస్తారు. వాహనాలకు వివిధ రంగుల్లో నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. అసలు ఏ రంగు నెంబర్ ప్లేట్ ఏ వాహనాలకు కేటాయిస్తారో తెలుసుకుందాం.
తెలుపు రంగు: ఈ నంబర్ ప్లేట్ వ్యక్తిగత వాహనాలకు ఇస్తారు. ఈ ప్లేటు కలిగిన వాహనాలను కమర్షియల్‌గా ఉపయోగించరాదు.
పసుపు రంగు : ట్యాక్సీలు, ఆటోలు వంటి ప్రయాణికులను తరలించే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్‌ను వాడతారు.
ఆకుపచ్చ : ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు ఉన్న నంబరు ప్లేట్లను ఏర్పాటు చేస్తారు.
ఎరుపు : ఈ రంగు నంబర్ ప్లేట్లు రాష్ట్రపతి, గవర్నర్ వాహనాలకు మాత్రమే కనిపిస్తాయి. మధ్యలో జాతీయచిహ్నం ఉంటుంది.
నలుపు : విలాసవంతమైన హోటళ్లలకు చెందిన వారి వాహనాలకు ఉపయోగిస్తారు.
నీలం రంగు : విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు ఈ రంగు నంబర్ ప్లేట్‌లు ఉంటాయి.
బాణం గుర్తు : ఈ నెంబర్ ప్లేట్‌లు సైనిక అవసరాలకు ఉపయోగిస్తారు. ఇవి రక్షణ శాఖకు రిజిస్టేషన్ అయి ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్‌లలో ఫస్ట్ లేదా రెండో అక్షరం తర్వాత బాణం గుర్తు ఉంటుంది. బాణం గుర్తు అనంతరం వచ్చే సంఖ్య వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత బేస్ కోడ్, సీరియల్ నంబరు, చివరిది వెహికల్ క్లాస్‌ను వివరిస్తుంది.
భారతదేశం సిరీస్ : నెంబర్ ప్లేట్‌పై బీహెచ్ అని ఉంటే ఆ వాహనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదిగా గుర్తించవచ్చు. నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ సీఎంసీలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు ఈ నెంబర్ ప్లేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
నంబర్ ప్లేట్ లేకుంటే : వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తే వారిపై సెక్షన్ 171 కింద ఆర్టీఏ, ట్రాఫిక్, పోలీసులు చర్యలు తీసుకుంటారు. మొదటిసారి పట్టుబడితే రూ.200, రెండోసారికి రూ.500 జరిమానా విధిస్తారు. మూడోసారి చిక్కితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. – ఖలీల్‌వాడి