
మానవత్వం చాటారు
వృద్ధురాలికి తినిపిస్తున్న మున్సిపల్
మాజీ చైర్‌పర్సన్ ఇందుప్రియ
వృద్ధురాలు శకుంతలతో మాట్లాడుతున్న
సీఐ నరహరి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ షెడ్డులో కొన్ని రోజులుగా వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఉంటున్న వృద్ధురాలి దీన స్థితిపై ‘సాక్షి’ దినపత్రిక మెయిన్‌పేజీలో సోమవారం ‘అనాథగా అమ్మ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కథనాన్ని చదివి ఏఎస్పీ చైతన్యారెడ్డి చలించిపోయారు. ఆ వృద్ధురాలికి అన్ని విధాలుగా సహాయం చేసి, పూర్తి వివరాలు సేకరించాలని పట్టణ సీఐ నరహరిని ఆదేశించారు. దీంతో సీఐ నరహరి సోమవారం ఉదయం వృద్ధురాలు శంకుతల ఉన్న చోటికి వెళ్లి వివరాలను సేకరించి ఏఎస్పీకి తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ సైతం సాక్షి కథనానికి స్పందించి మానవత్వం చాటారు. వృద్ధురాలి వద్దకు వెళ్లి స్వయంగా భోజనం తినిపించారు. దుస్తులు ధరింపజేసి, దుప్పటి అందజేశారు. పోలీసులతో కలిసి ఆటోలో వృద్ధురాలిని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. వృద్ధురాలి దీనస్థితిపై కథనం రాసిన ‘సాక్షి’కి ఏఎస్పీ, పట్టణ సీఐ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌తోపాటు పలువురు అభినందనలు తెలిపారు.
‘సాక్షి’ కథనానికి స్పందించిన
ఏఎస్పీ చైతన్యరెడ్డి
‘అనాథగా అమ్మ’ వివరాలు
సేకరించాలని సీఐకి ఆదేశం
ఆస్పత్రికి తరలించి వైద్యమందేలా
చేసిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్

మానవత్వం చాటారు