
ఎస్సారెస్పీ ఎస్‌ఈగా బాధ్యతల స్వీకరణ
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా జగదీశ్ సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు శ్రీనివాస్ గుప్తా ఇన్‌చార్జి ఎస్‌ఈగా కొనసాగారు. కాగా, ఇద్దరు ఎస్‌ఈలను టీఎన్జీవోస్ నాయకులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రా జెక్ట్ ఈఈ చక్రపాణి, డిప్యూటీ ఈఈలు, ఏఈ ఈలు తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ: వరద పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఈఈ చక్రపాణి సి బ్బందికి సూచించారు. ప్రాజెక్టుపై సోమవారం సిబ్బందితో వారు మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు నీటమట్టంపై దృష్టి సారించాలని, గేట్ల ఆపరేటింగ్ సరిగా చేపట్టాలన్నారు. వారి వెంట ప్రాజెక్ట్ ఏఈఈలు తదితరులు ఉన్నారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మి గులు జలాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరద గేట్లలో 40 వరద గేట్‌కు మోటార్ బిగించడాన్ని సంబంధిత అధికారులు మరిచిపోయారు. సోమవారం వరద గేట్లను ఎత్తినప్పటికీ మోటార్ లేకపోవడంతో 40వ గేటును ఎత్తలేదు. గత మూడు రోజులుగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండుకుండల మారుతోందని తెలిసినా అధికారులు మో టార్ గురించి పట్టించుకోలేదు. చాలా రోజులపాటు మరమ్మతులకు నోచుకోక వరద గేట్లు మొరాయించారు. ప్రస్తుతం మరమ్మతులు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పని చేయడం లేదు.

ఎస్సారెస్పీ ఎస్‌ఈగా బాధ్యతల స్వీకరణ

ఎస్సారెస్పీ ఎస్‌ఈగా బాధ్యతల స్వీకరణ