
ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌కు మాతృవియోగం
సిరికొండ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రిక్క లక్ష్మమ్మ శనివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. స్వగ్రామం సిరికొండ మండలం రావుట్లలో ఆమె అంత్యక్రియల ను ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల్లో బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు మధుశేఖర్ తదితరులు పాడె మోసి లింబాద్రిని పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల అనంతరం లింబాద్రిని పరామర్శించారు.
పంట రక్షణకు పాత చీరలు
బాల్కొండ: అడవి పందుల భారీ నుంచి మక్క పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. పాత చీరలను పంట చేనుకు రక్షణ కడుతున్నారు. మార్కెట్‌లో పాత చీరలను రూ.50 ఒక్కటి కొనుగోలు చేసి చీరలను చుట్టూ కంచె వేసినట్లు కడుతున్నారు. పంట రక్షణ కోసం రైతులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రస్తుత సంవత్సరం మక్క పంటకు అడవి పందుల బెడద తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గడ్కోల్‌లో..
సిరికొండ: అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. రాత్రి వేళల్లో మొక్కజొన్న చేనుపై దాడి చేయడానికి వచ్చే అడవి పందులకు బెదురుగా కనబడటానికి చేను చుట్టూ పాత చీరలను రక్షణగా కడుతున్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, న్యావనంది, నర్సింగ్‌పల్లి, చీమన్‌పల్లి, తాళ్లరామడుగు గ్రామాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అడవి పందుల నుండి కాపాడుకోవటానికి మొక్కజొన్న చేను చుట్టు పాత చీరలను బెదుర్లుగా వాడుతున్నారు.

ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌కు మాతృవియోగం

ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌కు మాతృవియోగం