
వరద ఉధృతి
బాల్కొండ: మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్ట్‌ల నుంచి మిగులు జలాలు వదలడంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి శనివారం మధ్యాహ్నం నుంచి లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. అర్ధరాత్రి సమయానికి లక్షా 30 వేలకు చేరింది. ఆదివారం ఉదయం 6 గంట ల సమయంలో లక్షా 52 వేల క్యూసెక్కులకు పెరి గింది. అప్పటి నుంచి రాత్రి వరకు ఇన్‌ఫ్లో నిలకడగా ఉంది. 10 గంటల సమయంలో లక్షా 43వేలకు తగ్గింది. ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ని గైక్వాడ్ ప్రాజెక్ట్ 92 శా తం నిండిందని, అక్కడి నుంచి మిగులు జలాలు విడుదల చేస్తే వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు.
ఇన్ ఫ్లో కొనసాగితే..
ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం లక్షా 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. సో మవారం మధ్యాహ్నం వ రకు ఇలాగే ఉంటే గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. గంట కు 0.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుండగా.. ప్రస్తుతం 67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇన్‌ఫ్లో నిలకడగా లేదా పెరిగినా మరో 6 టీఎంసీలు నీరు చేరి నీటి మట్టం 72 టీఎంసీలకు చేరుతుంది. గత రెండేళ్లుగా 70 టీఎంసీలు దాటగానే వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ ప్రాంతంలో నీరు ఎక్కువగా నిలిచి గ్రామాల్లోకి చేరుతోందనే కారణంతో 10 టీఎంసీల నీరు తక్కువగా ఉండగానే గేట్లను ఎత్తుతున్నారు. ఈ ఏడాది కూడా అలాగే నీటిని వదిలేందుకు ప్రాజెక్ట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
వరద కాలువ ద్వారా నీటి విడుదల..
వరద కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదల చేపట్టారు. ముందుగా 3 వేల క్యూసెక్కు ల నీటిని విడుదల చేసి క్రమంగా 10 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్‌కు 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 594 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం రాత్రి వరకు 1087.40(67.63 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
నది వైపు వెళ్లొద్దు
ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తే అవకాశం ఉందని, పశువుల కాపర్లు, రైతులు గోదావరి వైపువెళ్లొద్దని ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్‌గుప్తా హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్సారెస్పీ ప్రస్తుత నీటి నిల్వ
ఎస్సారెస్పీ ఆనకట్టపై పర్యాటకులు
అలీసాగర్ అప్రమత్తం
బోధన్: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోని అలీసాగర్ రిజర్వాయర్ వరద గేట్లను ఏ క్షణానైన ఎత్తే అవకాశం ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 ప్రధాన కాలువలోకి నీటిని వదిలేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. అలీసాగర్ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1299.6 ఫీట్లు కాగా, ఇప్పటి వరకు 1297 ఫీట్ల వరకు నీరు చేరిందని, మరో ఫీటు మేర నీటి నిల్వ పెరిగితే గేట్లు ఎత్తాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో డి–50 కాలువ విస్తరించి ఉన్నందున పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజాంసాగర్‌కు భారీ వరద
90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
పూర్తిస్థాయి నీటి మట్టానికి
చేరుకున్న జలాశయం
జిల్లా వ్యాప్తంగా 27.9 మి.మీ. వర్షం
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రోజున 27.9 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటలవరకు వర్షం కురిసింది. డొంకేశ్వర్‌లో 59.3, ఆలూర్ 38.3, నందిపేట 60.1, నవీపేట 48.1 , బోధన్ 33.0, ధర్పల్లి 29.9, పొతంగల్ 29.5, రెంజల్ 39.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి
లక్షా 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వేగంగా పెరుగుతున్న ప్రాజెక్ట్ నీటి మట్టం
ఇన్‌ఫ్లో కొనసాగితే గేట్లు ఎత్తే అవకాశం!
ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న ప్రాజెక్ట్ అధికారులు
ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో నిజాంసాగర్ గేట్లను సోమవారం ఉదయం ఎత్తివేయనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా ఎత్తే అవకాశం ఉంది. మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతాల రైతులు, పశువులకాపర్లు అప్రమత్తంగా ఉండాలని, నదులవైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఏక్షణానైనా ఎత్తే అవకాశం ఉంది.
ఉప్పొంగుతున్న గోదావరి
రెంజల్(బోధన్): జిల్లాతోపాటు ఎగువ మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావర ఉధృతంగా ప్రవహిస్తోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరితోపాటు మంజీరా, హరిద్ర నదుల నుంచి వరద ఉప్పొంగుతోంది. దీంతో కందకుర్తి పుష్కరక్షేత్రం వద్ద నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకొని వరద ప్రవహిస్తోంది. రెంజల్ ఎస్సై చంద్రమోహన్‌తోపాటు ఇన్‌చార్జి తహసీల్దార్ ఆసియా ఫాతిమా వరద ప్రవాహం నేపథ్యంలో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేయించారు.
పర్యాటకుల సందడి
బాల్కొండ: ఎస్సారెస్పీకి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు ప ర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవుకావడంతో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఉల్లాసంగా గడిపారు. ఆనకట్ట పైకి కార్లు, ద్విచక్ర వా హనాలు వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కనీస సౌకర్యాలు లేవని, అడ్డూఅదుపు లేకుండా వాహనాలు తిరుగుతున్నాయని పలువురు పర్యాటకులు విస్మ యం వ్యక్తం చేశారు.
నిజాంసాగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. ఎగువన ఉన్న పోచా రం ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, మంజీర నది, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఆదివారం అర్ధరాత్రి 90వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 1,402.37 అడుగుల (14.162 టీఎంసీ లు) నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆది వారం అర్ధరాత్రి తరువాత గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సోమవారం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

వరద ఉధృతి

వరద ఉధృతి

వరద ఉధృతి

వరద ఉధృతి