తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌

Aug 18 2025 5:41 AM | Updated on Aug 18 2025 5:41 AM

తెలంగ

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌

ఇచ్చిన హామీలను అమలు చేయాలి

నిజామాబాద్‌ నాగారం: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ సహకారంతో ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌ లో యువ ప్రోకబడ్డీ లీగ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా, శాతవాహన సైనికులు జట్టుకు చీఫ్‌ కోచ్‌గా జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్‌ నియామకం అయ్యారు. ప్రశాంత్‌ ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీలో కబడ్డీ కోచ్‌గా విఽ దులు నిర్వర్తిస్తున్నారు. ప్రోకబడ్డీ జట్టుకు కోచ్‌గా ఎంపికై న ప్రశాంత్‌ను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, కార్యదర్శి గంగాధర్‌ రెడ్డి, కోశాధికారి సురేందర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రవణ్‌ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, రాజకుమార్‌, గంగారెడ్డి, రాజేందర్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ రెడ్డి, హైదర్‌ అలీ, హరిచరణ్‌, అనురాధ, జ్యోతి, సీనియర్‌ క్రీడాకారులు అభినందించారు.

ఎస్సారెస్పీ

ఎస్‌ఈగా జగదీశ్‌

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌గా జగదీశ్‌ రానున్నారు. కంతనపల్లి ప్రాజెక్ట్‌ ఈఈగా పని చేస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. ఎస్సారెస్పీ ఇన్‌చార్జి ఎస్‌ఈగా ఏడాదిపాటు శ్రీనివాస్‌గుప్తా పని చేశారు. నూతన ఎస్‌ఈ సోమవారంబాధ్యతలు స్వీకరిస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

19న డైట్‌లో

స్పాట్‌ అడ్మిషన్లు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేటు డైట్‌ కళాశాలల్లో మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశపరీక్ష రాసి అర్హత పొందిన అభ్యర్థులకు వివిధ దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి డైట్‌ కళాశాలలో నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్లకు అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. ప్రైవేట్‌ డైట్‌ కళాశాలలో సీటు పొందాలనుకునేవారు 20వ తేదీన హాజరుకావాలని సూచించారు.

నిజామాబాద్‌ సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేశాయని, వాటిని అమలు చేయాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని నాందేవ్‌వాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గృహలక్ష్మి పథకం ప్రతి మహిళకు అందించాలన్నారు. రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ కూడా చాలా మందికి రావడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌ బాబు, నగర కార్యదర్శి బెజుగం సుజాత, రాములు, నర్సయ్య,అనసూయ, నరేశ్‌, దీపిక, అనిత పాల్గొన్నారు.

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌ 1
1/2

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌ 2
2/2

తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్‌ కోచ్‌గా ప్రశాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement