
క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చాలి
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీవైఎస్‌వో పవన్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా, పురుషుల జట్టు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీవైఎస్‌వో పవన్‌కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రీడాకారులు నైపుణ్యాలను ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. తాను కూడా మొదట బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడినేనని గుర్తు చేశారు. అనంతరం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా జిల్లా సంఘం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధిస్తుందన్నారు. జిల్లా క్రీడా మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ కోర్టుకు స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. వారు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే 71వ రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో బాల్‌బ్యాడ్మింటన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేష్, కార్యవర్గ సభ్యులు భాగ్యశ్రీ, గీత, సింధూజ, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తిక్, సాయికుమార్, పూజ పాల్గొన్నారు.
డీవైఎస్‌వో పవన్‌కుమార్
ఉమ్మడి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్
జట్టు ప్రాబబుల్స్ ఎంపిక